బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం

24 Mar, 2015 19:48 IST|Sakshi

'నువ్వు మరణించినా.. నలుగురిని జీవింపజేయి' అనే అవయవదాన ప్రధాన ఉద్దేశాన్ని ఆ తల్లిదండ్రులు ఉన్నతంగా భావించారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాల్ని.. వాటి అవసరంతో అల్లాడుతున్నవారికి ఇచ్చేందుకు ముందుకొచ్చి అతణ్ని చిరంజీవిగా నిలబెట్టారు.

హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న అఖిల్ మధు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. తల్లిదండ్రుల అంగీకారంతో అఖిల్ మధు గుండెను చెన్నైలోని ఓ వ్యక్తికి, కిడ్నీలను హైదరాబాద్ కు చెందిన ఇద్దరికి అమర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుండెను చెన్నై తరలించేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు