‘ఆ అమ్మాయి చాలా ఫాస్ట్.. పెళ్లి చేసుకోను’

13 Aug, 2016 18:21 IST|Sakshi
‘ఆ అమ్మాయి చాలా ఫాస్ట్.. పెళ్లి చేసుకోను’

హైదరాబాద్ : నిశ్చితార్థం జరిగింది.. పెళ్లి ముహుర్తం కూడా పెట్టుకున్నారు.. కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఆ ఎన్‌ఆర్‌ఐ యువకుడు మనసు మార్చుకొని ఈ పెళ్లి తనకిష్టం లేదంటూ ప్లేటు ఫిరాయించాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న వరుణ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన పెళ్లి కూడా నిశ్చయించారు.

అయితే గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ వరకు బాగానే ఉన్న వరుణ్ కాబోయే భార్యతో చాటింగ్ చేసేవాడు. ఫోటోలు కూడా షేర్ చేసుకునేవాడు. అయితే ఇటీవలనే అకస్మాత్తుగా వరుణ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువతి ప్రవర్తన మంచిది కాదంటూ వరుణ్ ప్రచారం చేశాడు. పైపెచ్చు  పెళ్లి చేసుకోవాలంటూ రూ.20లక్షలు అదనపు కట్నం కావాలంటూ షరతు పెట్టాడు.

తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చిందని.. అమ్మాయి ప్రవర్తన మంచిది కాదంటూ వరుణ్ ఫోన్లో చెప్పాడని అందుకే... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అమ్మాయి చాలా అడ్వాన్స్‌గా ఉందంటూ వరుణ్ మరో ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌తో పాటు తల్లి పూర్ణిమ, తండ్రి వినోద్‌కుమార్‌లపై ఐపీసీ సెక్షన్ 417 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా