మంత్రి ప్రారంభించిన మరుక్షణమే పగిలిన పైపులైన్

5 Nov, 2016 00:45 IST|Sakshi
మంత్రి ప్రారంభించిన మరుక్షణమే పగిలిన పైపులైన్

నాసిరకం పనులపై అమాత్యుని ఆగ్రహం
విజిలెన్‌‌స విచారణకు   ఆదేశం.. ?

ఉప్పల్ : మంచినీటి పైపులైన్ ప్రారంభించిన వెంటనే.. పైపులైన్ పగలడంతో అమాత్యులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమానగర్, లక్ష్మీనర్సింహాకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. రూ.3 కోట్ల వ్యయంతో  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా పైపులైన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వెంటనే పైపులైన్ పగిలి పెద్దఎత్తున ఫౌంటెన్‌ను తలపించేలా నీరు పైకి ఎగిసింది. దీంతో నీటికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వందలాదిమంది స్థానికులు, అప్పుడే ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జలమండలి అధికారులు ఆశ్చర్యపోయారు.

ఇవేమీ పనులంటూ ముక్కున వేలేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వేసిన పైపులైన్‌ను పగలడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి అంతటికి కారణం నాసిరకం పనులేనని అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పైపులైన్ నాణ్యతపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజిలెన్‌‌స విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే ఈ సంఘటనకు అవాక్కరుున జలమండలి అధికారులు తమ తప్పును సరిదిద్దుకునేందుకు పాత పైపులైన్లు పగిలిపోయాయని మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు