కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ

10 Aug, 2016 16:53 IST|Sakshi

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ....మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది.

కొత్త జిల్లాల సంఖ్య, ఏర్పాటు, జిల్లాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సాయంత్రం హైదరాబాద్లో భేటీయ్యింది. కాగా ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 రోజులు అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు