కృష్ణా జలాలపై కేబినెట్ సబ్‌కమిటీ

3 Nov, 2016 01:06 IST|Sakshi

మంత్రి హరీశ్ నేతృత్వంలో ఏర్పాటు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తదుపరి కార్యాచరణపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించారు. అవసరాన్ని బట్టి నిపుణులను కమిటీ ఆహ్వానించవచ్చని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశాలు, ఇప్పటికే ఉన్న రిట్ పిటిషన్‌పై వాదనలు చేసే అవకాశం, మరింత వాటా రాబట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితరాలపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు