‘మార్పిడి’ కష్టాలు

11 Nov, 2016 00:49 IST|Sakshi
‘మార్పిడి’ కష్టాలు

cancellation of the two days of big money troubleపడ్డ ప్రజలకు కాస్త ఊరట లభించింది. పాత నోట్లు తీసుకుని అన్ని బ్యాంకులు, ప్రధాన పోస్టాఫీసుల్లో గురువారం కొత్త నోట్లు ఇచ్చారు. అరుుతే ఇందుకోసం ప్రజలు ఉదయం నుంచే ఆయా బ్యాంకు శాఖల వద్ద క్యూకట్టారు. గంటల తరబడి లైనులో ఉండడంతో కొన్నిచోట్ల తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గుర్తింపు కార్డుతోపాటు భారీగా నగదుతో వచ్చినా కేవలం రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే ఇచ్చారు.          - సాక్షి, సిటీబ్యూరో

మా నోటు మారేదెట్టా బాబయ్యా!
నోట్ల మార్పిడి సంచార జీవులకు కష్టంగా మారింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు వీధివీధి తిరిగుతూ.. కూడళ్లలో బిచ్చమెత్తుకుని బతికేవారు. దారినపోయేవారు ధర్మంగా వేసిన రూపారుు, రూపారుు కూడబెట్టి చిల్లర మొత్తాన్ని పెద్ద నోట్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు రూ.500 నోట్లు చెల్లవు అనేసరికి.. తమవద్దనున్న నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక వివిల్లాడుతున్నారు. ‘మా నోట్లు చెల్లవా’.. అంటూ అమయకంగా ప్రశ్నిస్తున్నారు. తాము అడుక్కుని సంపాదించిన చిల్లరను ఇచ్చి నోట్లు తీసుకున్నామని, ఇప్పుడు ఇవి ఎంచేయాలని దారినపోయేవారిని అమాయకంగా అడుగుతున్నారు. ఏ బ్యాంకుకు వెళ్లాలి.. ఎక్కడ మార్చుకోవాలో చెప్పాలంటూ ప్రాధేయపడుతున్నారు.           - కుత్బుల్లాపూర్

మరిన్ని వార్తలు