సెల్‌ఫోన్ దొంగలున్నారు బహుపరాక్!

12 Mar, 2016 10:35 IST|Sakshi
సెల్‌ఫోన్ దొంగలున్నారు బహుపరాక్!

నరగంలో పెరుగుతున్న మొబైల్స్ చోరీలు
దొంగల అవతారం ఎత్తుతున్న విద్యార్థులూ
‘సర్వం’ కోల్పోతున్న సెల్ వినియోగదారులు
జాగ్రత్తలు తీసుకోవడమే మేలు: పోలీసులు

 
 బోరబండ న్యూ రామారావునగర్‌కు చెందిన విద్యార్థులు చిట్టిమేల కేతేష్‌రెడ్డి, మేకల సందీప్ లాలాగూడ, మల్కాజిగిరిలకు చెందిన స్టూడెంట్స్ ప్రదీప్‌కుమార్, కార్తీక్, చైతన్య, మల్కాజిగిరికి చెందిన సుధాకర్  ఆసిఫ్‌నగర్‌లోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న, మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఇరువురు బాలురు
 
సిటీబ్యూరో:  నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడి జూబ్లీహిల్స్, గాంధీనగర్ పోలీసులకు చిక్కి గురువారం జైలుకెళ్లిన ముఠాలివి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ హస్తభూషణంగా మారింది. దీని వినియోగం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో... అన్ని నష్టాలూ ఉన్నాయి.  సెల్‌ఫోన్ల వినియోగం పెరిగాక ప్రజల ‘జ్ఞాపక శక్తి’ చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా దీన్ని పోగొట్టుకుంటే... ‘సంబంధాలను’ కోల్పోతున్నారు. మరోపక్క సెల్‌ఫోన్ చోరీ అనేది వ్యవస్థీకృతం మారడంతో ఈ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు 25 వేల సెల్‌ఫోన్లు చోరీ అవుతున్నాయి. రికార్డుల్లోకి ఎక్కని ఉదంతాల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని పోలీసులే అంటున్నారు.  నగరంలో ఒకప్పుడు పిక్‌పాకెటింగ్ చేసే అనేక ఛోటా మోటా ముఠాలు ప్రస్తుతం సెల్‌ఫోన్ స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ స్నాచింగ్ ఎక్కువగా కొనసాగుతోంది. వ్యవస్థీకృత నేరాలు చేసే ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి.
 
సిటీ కాప్స్ సేవలు...
ఈ సెల్‌ఫోన్ చోరీల్లో బాధితులకు న్యాయం చేసేందుకుపోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెల్‌లో స్టోలెన్ మొబైల్ ట్రాకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. నగరంతో పాటు పొరుగు ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల నుంచి చోరీకి గురైన సెల్‌ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్ల ద్వారా ఇక్కడి అధికారులు వాటిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ యూని ట్‌కు మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో  60 శాతం ఫోన్లను రికవరీ చేయగలిగింది. మరోపక్క ‘లాస్ట్ రిపోర్ట్’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించిన అధికారులు చోరీ కాకుండా పోగొట్టుకున్న మొబైల్స్‌కు సంబంధించిన ధువ్రీకరణ పత్రాన్ని ఠాణాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ-మెయిల్ ద్వారా అందిస్తున్నారు.
 
జాగ్రత్తలే మేలు...
ఓ పక్క దొంగలు ఇలా వ్యవస్థీకృతంగా రెచ్చిపోతుంటే... బాధితులకు మాత్రం అన్ని చోట్లా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సెల్‌ఫోన్ పోయిందని పోలీసులను ఆశ్రయిస్తే... వారి నుంచి సరైన స్పందన  లభించదు. ఈ కేసులను ఎఫ్‌ఐఆర్ కూడా చేయడంలేదు. ఫిర్యాదులకు జీడీ ఎంట్రీ పెట్టినా... వాటిపై తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. అనేక మంది బాధితులకు ఫోను పోయిన దాని కంటే.. అందులో డేటా విషయంలోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సన్నిహితులు, బంధు,మిత్రుల ఫోన్ నెంబర్లన్నీ సెల్‌లోనే ఫీడ్ చేస్తున్నారు. దీంతో గుర్తుంచుకోవడం, నోట్ చేసుకోవడం మర్చిపోయారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు చెప్తున్నారు.
     
{పతి సెల్‌ఫోన్‌కీ 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై) నెంబర్ ఉంటుంది. మొబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్‌ఫోన్‌లో (ూు06ు) బటన్లు నొక్కితే ఈ నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని దాచుకోవాలి, ఫోను చోరీ అయితే దీని సహాయంతో అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోడం వారి వల్లకాదు. ఇప్పుడు మార్కెట్‌లోకి ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టల్ చేసుకుంటే... అది పోయిన సందర్భంలో ఎవరైనా దక్కించుకుని, అందులో వే రే సిమ్‌కార్డు వేసి వాడటం ప్రారంభించిన వెంటనే మీకు సందేశం వస్తుంది. తద్వారా మీ సెల్ ఆచూకీ తెలుసుకోవచ్చు.
     
{పస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్లతో పాటు జీమెయిల్ తదితర కంపెనీలు ఫోన్‌బుక్ బ్యాకప్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగించుకోవడం ద్వారా మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా కంపెనీ దగ్గర, మీ మెయిల్‌లోనూ బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సురక్షితంగా ఉంటుంది.{పతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్‌లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్‌లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది.
 
సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో ముగ్గురు విద్యార్థుల రిమాండ్
యాకుత్‌పురా: కళాశాలలో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఓ విద్యార్థిని డబీర్‌ఫురా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అదనపు ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కుమార్ కథనం ప్రకారం....హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన మిస్బా (20) న్యూ మలక్‌పేటలోని నవాబ్ షా ఆలం కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈనెల 5న కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన గోరెటి విష్ణుతో పాటు మరో నలుగురు విద్యార్థులు పరీక్షా కేంద్రం బయట ఉన్న బైక్‌లో తమ సెల్‌ఫోన్లు ఉంచారు. ఇది గమనించిన మిస్బా... విష్ణు సెల్‌ఫోన్‌ను అపహరించుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా మిస్బాను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.  
 
కటకటాల్లోకి మరో ఇద్దరు స్టూడెంట్స్...
అడ్డగుట్ట: పరీక్ష రాసేందుకు వచ్చిన వారి సెల్‌ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు విద్యార్థులను తుకారాంగేట్ పోలీసులు జైలుకు పంపారు. వారి నుంచి 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బెన్‌హర్ (20) డిప్లొమా, కె.విజయ్(19) ఐటీఐ చదువుతున్నారు. వీరిద్దరూ ఈనెల 9న మారేడ్‌పల్లిలోని సెయింట్ జాన్స్ కాలేజీ వద్దకు వెళ్లారు. ఆ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు బైక్‌ల్లో భద్రపర్చిన సెల్‌ఫోన్లను వీరిద్దరూ ఎత్తుకెళ్లారు.  
 
 

మరిన్ని వార్తలు