నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు..

19 Jan, 2016 19:51 IST|Sakshi

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, హెచ్సీయూలో పరిణామాలపై కేంద్ర మానవ వనరుల శాఖ వేసిన ఇద్దరు సభ్యుల నిజ నిర్థారణ కమిటీని వర్సిటీ విద్యార్థులు మంగళవారం వెనక్కి పంపారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే విచారణకు తమ వద్దకు రావాలని హెచ్సీయూ విద్యార్థులు  తేల్చి చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు ఎన్హెచ్ఆర్డీయే కారణమని వాళ్లు ఆరోపించారు.

 

అదే  కమిటీనీ విచారణకు పంపడం హంతకులతో రాజీ పడటమే అని విద్యార్థులు ధ్వజమెత్తారు. కనీసం ఐఏఎస్ అధికారులను కాకుండా అండర్ సెక్షన్ అధికారులను కమిటీ సభ్యులుగా పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో విచారణ చేపట్టకుండానే కమిటీ సభ్యులు వెనుదిరిగారు. మరోవైపు హెచ్సీయూలో మూడోరోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు