గ్యాస్ ప్లాంట్లపై చిగురించిన ఆశలు

9 Jun, 2016 03:46 IST|Sakshi

శంకరపల్లి, కరీంనగర్ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాలన్న కేంద్రం

 సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి మూలపడ్డ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరీంనగర్‌లో 2,100, శంకరపల్లిలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులపై పునఃపరిశీలన జరిపేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి టి.రామచంద్రు ఈ రెండు విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండి యా (గెయిల్) చెర్మైన్ త్రిపాఠి సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది.

ప్రతిపాదనలు పంపిస్తే కేటాయింపులపై మళ్లీ పరిశీలన జరుపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శంకరపల్లిలో ప్రతిపాదిత వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రోజుకు 5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) సహజ వాయువు అవసరం. కరీంనగర్ లోని  2,100 మెగావాట్ల ప్లాంట్ కోసం మరో 10 ఎంఎంఎస్‌సీఎండీల సహజవాయువు అవసరమని అంచనా. దేశంలోని గ్యాస్ కొరత, పైప్‌ైలైన్ల కొరత వల్ల ఈ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు సాధ్యంకాలేదు. ఇరాన్ నుంచి అఫ్గానిస్తాన్ మీదుగా దేశానికి సహజవాయువు తరలించేందుకు కేంద్రం ఒప్పం దాలు కుదుర్చుకుంది.  దీంతో గ్యాస్ ఆధారి త విద్యుత్ ప్లాంట్లకు కేటాయింపులు జర గొచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు