‘ఉపాధి హామీ’ని నీరుగార్చే యత్నాలు: చాడ

3 Nov, 2016 01:20 IST|Sakshi
‘ఉపాధి హామీ’ని నీరుగార్చే యత్నాలు: చాడ

సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కొరతతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ చట్టాన్ని బలోపేతం చేసి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట  సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై హింస పెరుగుతున్నా, ఈ ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా, ఈ ఏడాది 1,983 కేసులు నమోదైనా, నివారించడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉస్తేల సృజన, ఎన్.జ్యోతి, ఎం.నళిని, ఎస్.ఛాయాదేవి, సదాలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు