చాయ్ డబ్బా తలకిందులు!

16 Nov, 2016 01:14 IST|Sakshi
చాయ్ డబ్బా తలకిందులు!

సాక్షి, హైదరాబాద్: ‘‘పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు కడక్ చాయ్ ఇచ్చా.. వారిని వదిలే ప్రసక్తే లేదు..’’ ప్రధాని మోదీ అన్న మాటలివీ! కుబేరుల సంగతేమోగానీ పెద్దనోట్ల రద్దుతో చాయ్‌వాలాల పరిస్థితి మాత్రం తలకిందులవుతోంది!! బతుకుబండిని నడిపించే చాయ్ డబ్బా పట్టాలు తప్పుతోంది. దశాబ్దాలుగా నడుపుకొంటూ వస్తున్న చాయ్ దుకాణాలు వారం రోజుల్లోనే చతికిల పడ్డారుు. మహానగరం హైదరాబాద్‌లో ఇలా చాయ్ డబ్బాలు పెట్టుకొని పొట్టబోసుకునేవారెందరో అష్టకష్టాలు పడుతున్నారు. అందులో యాదగిరి ఒకరు. పెద్దనోట్ల రద్దుతో ఆయన దయనీయ పరిస్థితిపై  ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

 నాలుగు దశాబ్దాల ప్రస్థానం..
 త్యాగరాయగాన సభ మీదుగా చిక్కడపల్లి నుంచి అశోక్‌నగర్‌కు వెళ్లే మార్గంలో  నగర కేంద్ర గ్రంథాలయానికి ఎదురుగా  ఉంటుంది యాదగిరి చాయ్ డబ్బా. నలభై  ఏళ్లుగా యాదగిరి అక్కడే  చాయ్ దుకాణం నడిపిస్తున్నాడు. అప్పట్లో  చిక్కడపల్లి ఏ మాత్రం జనసంచారం లేని అతి సాదాసీదా ప్రాంతం. అక్కడొకటి, ఇక్కడొకటి విసిరేసినట్లుగా ఉండే ఇళ్లు, లైబ్రరీ మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో  పత్రికలు, నవలలు, కథలు చదివే పాఠకులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చేవారు. అలా వచ్చేవారికి కట్ల అబ్బయ్య చాయ్ డబ్బా బాగా పరిచయం. యాదగిరి తండ్రే అబ్బయ్య. తొలినాళ్లలో  అబ్బయ్య చాయ్ దుకాణం నడిపించినా ఆ తర్వాత క్రమంగా దాని బాధ్యత యాదగిరిపైనే పడింది. ‘‘పది పైసలు, పదిహేను పైసలు ఉన్నప్పట్నుంచి చాయ్ అమ్ముతున్నం.  మా నారుున తర్వాత నేను చాయ్ దుకాణానికి  ఎక్కిన తర్వాత చారాణా అరుుంది. అట్లా అట్లా పెంచుకుంటా ఇప్పడు ఆరు రూపాయాల దాకా వచ్చినం’’ అని అన్నాడు యాదగిరి. క్రమంగా చిక్కడపల్లి-అశోక్‌నగర్ మార్గం జనసమ్మర్ధంతో నిండడంతో యాదగిరి కుటుంబం మొత్తం ఈ చాయ్ దుకాణం పైనే ఆధారపడే స్థారుుకి చేరుకుంది.

 చిల్లర కోసం తలోదిక్కు..
 పిడుగుపాటులా వచ్చి పడ్డ నోట్ల కష్టం ఇప్పుడు యాదగిరి కుటుంబానికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు రోజుకు 20 లీటర్ల పాలు ఖర్చయ్యేవి. వెరుు్యకి పైగా చాయ్‌లు అమ్మేవాళ్లు. ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరి, అతని కొడుకులు కలిసి పనిని పంచుకొనేవాళ్లు. ముషీరాబాద్‌లోని ఇంటి దగ్గర నుంచి తెల్లవారు జామున 4 గంటలకు బయల్దేరి బండి దగ్గరకు వస్తే రాత్రి 10 తర్వాత ఇంటికి వెళ్లేవాళ్లు. కానీ వారం రోజుల నుంచి పరిస్థితి మారింది. ఉదయాన్నే తలా ఒక దిక్కు బ్యాంకులకు, ఏటీఎం సెంటర్‌లకు పరుగెత్తుతున్నారు. నోట్లు మార్చుకొనేందుకు మధ్యాహ్నం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. అరుునా  వంద నోట్లు లభించడం లేదు. చిల్లర కొరత  భయానకంగా మారింది. ఆ సమయంలో యాదగిరి బండి దగ్గరే ఉండి గిరాకీ చూసుకుంటున్నాడు. చేతిలో చిల్లర లేకపోవడంతో ఉద్దెర బేరానికి తలొగ్గాల్సి వస్తుంది. లేదంటే గిరాకీ వదులుకోవలసి వస్తుంది. ‘‘గిరాకీ  బాగా ఉన్న రోజుల్లో ఖర్చులన్నీ పోను రోజుకు రూ.1000 నుంచి రూ.500 ఆదాయం లభించేది. ఇప్పుడు రూ.500 కూడా రావడం లేదు. 20 లీటర్ల పాలు అమ్మిన చోట 10 లీటర్లు కూడా అమ్మలేకపోతున్నాం. పరిస్థితి పూర్తిగా మారింది. వెరుు్య చాయ్‌లు అమ్మిన చోట ఇప్పుడు రెండు, మూడు వందలు కూడా అమ్మలేకపోతున్నాం’’ అంటూ యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 ‘పెద్ద’ దెబ్బ...
 యాదగిరి, ఆయన తల్లి, ఆయన భార్య, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కలిపి 15 మందికి ఆ చాయ్ డబ్బాయే ఆధారం. ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. ఇప్పటికే రూ.6 లక్షలు ఖర్చయ్యారుు. తరచుగా ఆసుపత్రికి  వెళ్లాలి. రూ.వేలల్లో ఖర్చు. రేషన్, నిత్యాసవరాలు తడిచి మోపెడవుతున్నారుు. ‘‘ఇప్పటి వరకు చాయ్ దుకాణాంపైనే ఆధారపడి  అన్ని కష్టాలను గట్టెక్కుతూ వచ్చినం. పరిస్థితి ఇట్లాగే ఉంటే ఏం చేయాల్నో అర్థమైతలేదు. వెనుకటికి ముషీరాబాద్ మహాత్మానగర్‌ల 50 గజాల ఇంటిస్థలం సంపాదించి పోరుుండు మా నారుున. ఇంటి కిరారుు బాధలు లేవు కానీ. మిగతా ఖర్చులన్నీ భారీగానే ఉన్నారుు’’ అని యాదగిరి చెప్పాడు. ఇలాంటి ఎంతో మంది చాయ్‌వాలాలు ఇప్పుడు ఆ ‘చాయ్‌వాలా’ సృష్టించి న బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నారు.
 
 నేనెక్కడికి పోవాలే?
 ‘‘యాదగిరి చాయ్ డబ్బా అంటే ఈ రాస్తాల అందరికీ తెలుసు. కానీ ఏం లాభం? జేబుల చిల్లర పైసలు లేవని చాలామంది చాయ్ తాగడానికి వస్తలేరు. ఉద్దెర గిరాకీ పెరిగింది. చాయ్‌కి రూ.500 నోటు ఇస్దే దాన్ని తీసుకొని నేనెక్కడికి పోవాలే? అరుునా రాత్రనకా, పగలనకా  నా కొడుకులూ, నేను  అటు బ్యాంకులకు. ఇటు ఏటీఎం సెంటర్‌లకు పరుగెత్తుతూనే ఉన్నం. ఎక్కడికి పోరుునా వంద నోట్లు దొరుకుడు కష్టంగానే ఉంది’
 -  చాయ్‌వాలా యాదగిరి ఆవేదన ఇది.

మరిన్ని వార్తలు