నల్లకుంటలో చైన్ స్నాచింగ్

11 Sep, 2015 22:26 IST|Sakshi

నల్లకుంటః నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. నల్లకుంట మోరం క్యారీలో నివాసం ఉండే ఆర్.రేణుక దేవి (41) నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది.

అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని  మూడు తులాల బంగారు పుస్తెల తాడును పట్టి లాగారు. వెంటనే అప్రమత్తమైన ఆమె గొలుసు గట్టిగా పట్టుకోవడంతో గొలుసులోని కొంత భాగం తెగి ఆమె చేతికి చిక్కింది. కాగా మరో చైన్ ముక్కతో ఆగంతకులు పరారయ్యారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు