సరూర్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్

12 Apr, 2015 11:14 IST|Sakshi

సరూర్‌నగర్ : గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీబీ కాలనీలో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి భార్య ఫాతిమా(30) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను బచ్‌పన్ స్కూల్ నుంచి బైక్‌పై తీసుకొని వస్తుంది. సరిగా ఇదే సమయంలో ఆమెను అనుసరిస్తున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లారు.


నిందితులు నేరుగా జాతీయరహాదారి - 65  పై పరారయ్యారని బాధితురాలు తెలిపారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు వేసుకున్న టీషర్ట్ మాత్రమే తను గుర్తించినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు