మీర్‌పేట్‌లో చైన్ స్నాచింగ్

2 Sep, 2016 18:43 IST|Sakshi

మీర్‌పేట్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగమణి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. చోరీ కాబడిన గొలుసు 5 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు