కటకటాల్లోకి గొలుసు దొంగలు

1 Aug, 2013 02:09 IST|Sakshi

మన్సూరాబాద్,న్యూస్‌లైన్: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాలను వనస్థలిపురం,సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ డీసీపీ రవివర్మ, ఏసీపీలు ఆనంద్‌భాస్కర్, వెంకట్‌రెడ్డిల వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన యాదగిరి అలియాస్ గిరి (23) ఇంటర్ చదివి ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అలియాస్ శ్రీను (22) కల్వకుర్తి వైఆర్‌ఎం డిగ్రీ కళశాలలో బీఏ ఫైనలియర్ చదువుతున్నాడు.
 
 వీరిద్దరు కలిసి ఒంటరిగా రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఎంచుకొని బైక్‌పై బంగారు గొలుసులను అపహరించేవారు. ఇలా వీరు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 6, హయత్‌నగర్ పరిధిలో 3, ఎల్‌బీనగర్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఎన్జీవోస్‌కాలనీలోని ఓ జువెల్లరీ దుకాణంలో దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని విచారించడంతో దొంగతనాలను ఒప్పుకున్నారు. వీరినుంచి 6తులాల పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.  
 
 సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో : మంగళ్‌హాట్‌లో నివాసముంటూ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్న మహ్మద్‌అక్బర్‌పాషా, చంపాపేటలో నివాసముంటూ వెల్డింగ్ పనిచేస్తున్న మహ్మద్‌షాహెద్‌లు కలిసి నగరంలో వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 16చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వీరు చంపాపేట క్రాస్‌రోడ్డుసమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సరూర్‌నగర్ పోలీసులు పట్టుకొని విచారించగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2, సరూర్‌నగర్ పరిధిలో 1, చైతన్యపురి పరిధిలో 5, ఎల్‌బీనగర్‌లో 8 దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరినుంచి 2తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు