మళ్లీ రెచ్చిపోయిన చైన్స్నాచర్లు

12 Oct, 2016 16:59 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలో చైన్స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. బీఎన్రెడ్డి నగర్లో బుధవారం శాంతమ్మ అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని వ్యక్తి.. సమీపంలో బైక్పై ఆగి ఉన్న వ్యక్తితో కలసి పరారైయ్యాడు. దీంతో తెరుకున్న శాంతమ్మ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు వారిని వెంబడించిన... ఫలితం లేకపోయింది.

బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు