'కాపునేతకు బాబు భయపడుతున్నారు'

25 Jan, 2017 17:53 IST|Sakshi
'కాపునేతకు బాబు భయపడుతున్నారు'

హైదరాబాద్‌: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో వీహెచ్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ప్రభుత్వ పాలన బ్రిటీష్‌ పాలనను తలపిస్తోందని ఆరోపించారు.

 

కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేసే అవకాశం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముద్రగడను ఒంటరి చేసి కాపు ఉద్యమాన్ని నీరుగార్చాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు