ఇంటర్ ఇంగ్లిష్‌లో మార్పులు

9 Jun, 2016 00:38 IST|Sakshi
ఇంటర్ ఇంగ్లిష్‌లో మార్పులు

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను మార్పు చేశామని, అవి 2016-17 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ మోడర్న్ లాంగ్వేజ్ పాఠ్య పుస్తకాలు మారాయన్నారు.

మారిన పాఠ్య పుస్తకాలను త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆయా సబ్జెక్టుల్లో ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు 2017 మార్చి, మే/జూన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని వివరించారు.

>
మరిన్ని వార్తలు