గూగుల్లో టాప్.. మన చార్మినార్!!

3 Sep, 2014 20:44 IST|Sakshi
గూగుల్లో టాప్.. మన చార్మినార్!!

400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ పేరు చెప్పగానే మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చేది.. చార్మినార్. ఇప్పుడు అది గూగుల్లోనే అత్యధికంగా సెర్చ్ చేసిన చారిత్రక కట్టడంగా రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో అత్యధికంగా వేటికోసం సెర్చ్ చేశారన్న వివరాలను గూగుల్ చూసినప్పుడు.. చారిత్రక కట్టడాలలో చార్మినారే నెంబర్ 1గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం), కర్ణాటక, తమిళనాడు వాసులు దీనికోసం ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది.

ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ 2013 సంవత్సరంలో భారతీయ నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన నగరమని, ఈసారి కూడా పర్యాటకులు ఎక్కువగా నగరంలోని చార్మినార్ గురించే వెతికారని చెప్పింది. ఈ నగరంలో సమ్మిళిత సంస్కృతి, చారిత్రక వారసత్వం అన్నీ ఉన్నాయని తెలిపింది. చార్మినార్ తర్వాత హైదరాబాద్లో అత్యధికంగా వెతికిన కట్టడం.. గోల్కొండ కోట. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వాసులు ఎక్కువగా వెతికారట. ఈ సెర్చిల జాబితాలో మూడో స్థానంలో సాలార్జంగ్ మ్యూజియం నిలిచింది. ఫలక్నుమా ప్యాలెస్ గురించి కూడా చాలామంది వివరాలు చూశారు.

 

మరిన్ని అందమైన చార్మినార్ చిత్రాలకు క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు