'చెన్నై ఎక్స్ ప్రెస్' దొంగల ముఠా అరెస్టు!

7 Jul, 2014 09:36 IST|Sakshi

సికింద్రాబాద్ : బీహార్కు చెందిన పేరుమోసిన రైల్వే దొంగల ముఠా...కరణ్థీర్ గ్యాంగ్ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠానే ఈ ఏడాది ఏప్రిల్ 1, 2 తేదీల్లో చెన్నై ఎక్స్ప్రెస్లో వరుస దోపిడీలకు పాల్పడిటన్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితమే ఈ గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... సీఆర్పీఎఫ్ పోలీసులు మౌలాలి రైల్వే స్టేషన్లో రణధీర్ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని, జనరల్ రైల్వే పోలీసులకు అప్పగించారు.

విచారణలో భాగంగా పోలీసులు రణధీర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతనికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది.  అతను ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే రణధీర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో విషయం బయటకు పొక్కకుండానే అయిదుగురిని రిమాండ్కు పంపినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు