ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు

13 Nov, 2016 00:58 IST|Sakshi
ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు

- పిల్లల్ని వేధిస్తే 1098కి ఫోన్ చేయాలి
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
- సంచాలకులు విజయేందిర బోరుు  
 
 సాక్షి, హైదరాబాద్: ‘బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. వారి సంరక్షణకు ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా, సంబంధిత శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ కేంద్రా లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లల్ని వేధించినట్లు తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయం డి. ఈ కమిటీ చర్యలకు ఉపక్రమిస్తుంది’ అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయేందిర బోరుు పేర్కొన్నారు.  రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో రాష్ట్రస్థారుు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆ రోజు ఉదయం 8.30కి గన్‌పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు చిన్నారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల హక్కులు, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించేలా  కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.  బాల సదనాల ను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. పిల్లల దత్తతను ఆన్‌లైన్‌లో చేపడుతున్నామని, గతేడాది 215 మంది పిల్లల్ని దత్తతిచ్చామన్నారు. పట్టణాల్లో పిల్లల భిక్షా టనపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖర్లో నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శాఖ పరంగా వసతి పొందుతున్న బాల, బా లికలకు  గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించనున్న ట్లు వివరించారు. సమావేశంలో ఆ శాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మి, రాములు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు