చిట్ ఫండ్ పేరు తో కుచ్చుటోపీ

8 Dec, 2015 18:53 IST|Sakshi

నమ్మకంగా ఉంటూ చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు.. వినియోగదారులకు సంబంధించిన రూ.కోటి వసూలు చేసుకుని కనిపించకుండా పోయిన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


మారుతి చిట్‌ఫండ్ సంస్థ కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల చిట్టీలు పాడుకున్న వారికి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. గత రెండు రోజులుగా నిర్వాహకులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. అనుమానం వచ్చిన బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. 

దీంతో సుమారు 50 మంది బాధితులు నేరేడ్‌మెట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్స్ డైరెక్టర్లు సునీల్ కుమార్, పుష్పరాజ్, ప్రదీప్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వద్ద సుమారు రూ.కోటి వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు.



 

మరిన్ని వార్తలు