అభివృద్ధి లేదు... సొంత ఎజెండానే!

26 Aug, 2016 02:13 IST|Sakshi
అభివృద్ధి లేదు... సొంత ఎజెండానే!

ప్రభుత్వాల తీరుపై చుక్కా రామయ్య
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీలు, గద్దెనెక్కాక సొంత ఎజెండాలనే తెరపైకి తెస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. దళిత వర్గాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రకటన నిమిత్తం గురువారం ఇక్క డ జరిగిన టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో రామయ్య మాట్లాడా రు. ప్రస్తుతం అసెం బ్లీలో రాజకీయాల భాష మారిపోయిందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా రాజకీయ నాయకులకు తామేమీ తీసిపోలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
 
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి...
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పి.మాణిక్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రకటించారు. టీఎస్‌యూటీఎఫ్‌తో పాటు ఎస్‌టీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, ఎయిడెడ్, కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ తదితర సంఘాలన్నీ మాణిక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా మద్దతు పలికాయన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి చావ రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు