దవాఖానాలో మర్యాద రామన్నలు..!

19 Jan, 2017 04:45 IST|Sakshi
దవాఖానాలో మర్యాద రామన్నలు..!
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇకపై మర్యాదే మర్యాద
  • పారిశుద్ధ్యం, బాత్‌రూమ్‌లు  ఇక క్లీన్‌ అండ్‌ గ్రీన్‌
  • శాస్త్రీయ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
  • వంద మార్కులొస్తేనే కాంట్రాక్టర్లకు 100% చెల్లింపులు
  • సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల చీదరింపులు.. ఛీత్కారాలు.. మనం చూస్తూనే ఉంటాం. రోగులను ఎక్కడా నిలబడనీయరు.. కూర్చోనీయరు. ఇక పారిశుద్ధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాయిలెట్లు అధ్వానంగా ఉంటే.. ఆస్పత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తుం టుంది. దీంతో సర్కారు దవాఖానాకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇకపై ఇలాంటి పరిస్థితు లకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. సమగ్ర ఆస్పతుల నిర్వహణ, వసతులు, సేవల విధాన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 18 వేల పడకల కు ఒక్కో పడకకు నెలకు రూ.6 వేల చొప్పున నిర్వ హణ ఖర్చు కింద ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. దీంతో అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మర్యాదలు చేసేందుకు, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు.. బాత్‌రూంలు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తగు సిబ్బందిని నియమించుకోనున్నారు.

    సర్వే అనంతరం శాస్త్రీయ నిర్ణయం..
    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల మొదలు ఉస్మానియా, గాంధీ వరకు అన్ని బోధన, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అధ్వా నంగా ఉన్నాయని సర్కారు అంచనా వేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో శాంపిల్‌ సర్వే చేసింది. ఆస్పత్రులు అధ్వానంగా ఉండటానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిం ది. ఒక ఆస్ప త్రిలో చేసిన సర్వే ప్రకారం అక్కడ భద్రతా సిబ్బంది 110 మంది, రోగులకు అవసరమైన సేవలు చేసేందుకు 267 మంది, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు 239 మంది అవసరమని, ప్రస్తుతం వీటిలో సగానికి సగం కూడా లేదని తెలిపింది.

    అందువల్ల సిబ్బందిని వివిధ ప్రైవేటు సంస్థల నుంచి నియమించుకుని ఆస్పత్రుల్లోని ఆయా రంగాల ను మరింత మెరుగుపరచాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. బోధనాస్ప త్రులను రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదు పా యాల అభివృద్ధి సంస ఎండీ, జిల్లా స్థాయిలోని ఆసుపత్రులన్నింటినీ కలెక్టర్‌ పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో అన్ని బోధనాసుపత్రుల్లో 10 వేల పడ కలున్నాయి. వాటి నిర్వహణకు రూ.60కోట్లు, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 8 వేల పడకలకు రూ.48 కోట్లు కేటాయించారు.

    ‘వంద’వస్తేనే వంద శాతం చెల్లింపులు..
    మార్కుల ఆధారంగా ఆçస్పత్రుల పారి శుద్ధ్యం, బాత్‌రూంలు, భద్రత, రోగుల పట్ల మర్యాదగా మెలగటం వంటి అంశాలను అంచనా వేస్తారు. వచ్చే మార్కులను బట్టే కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తారు. లేకుంటే ఆ ప్రకారం వారికి చెల్లించే నిధుల్లో కోత విధిస్తారు. 11 విభాగాలుగా నిర్వహణ పనులను విభజించారు. ఒక్కో విభాగానికి మార్కులను నిర్ధారించారు. అటెండర్ల తీరు, వారి యూనిఫాంకు 5 మార్కులు, రోగుల పట్ల మర్యాదగా ఉంటే 10 మార్కులు, బాత్‌ రూం, వాష్‌రూంల క్లీనింగ్‌కు 10, వార్డుల క్లీనింగ్‌కు 10, ఓపీ, లేబరేటరీలు, లేబర్‌ రూంల క్లీనింగ్‌కు 10, డ్రైౖనేజీ నిర్వహణకు 10, పారిశుద్ధ్యంలో ఉపయోగించే పరిక రాలు, కెమికల్స్‌ తదితరాలకు 10, పబ్లిక్‌ను నియంత్రణలో ఉంచేందుకు 10, ఫిర్యాదులు లేకుండా నిర్వహించడానికి 10, భద్రతకు 10, పార్కింగ్, గుంపులు లేకుండా చూసేం దుకు 5 మార్కులు కేటాయించారు. నూటికి నూరు మార్కులు వస్తేనే నూరు శాతం నిధులు విడుదల చేస్తారు. లేకుంటే ఎంత శాతం మార్కులు వస్తాయో అంత శాతమే నిధులను విడుదల చేస్తారు. ఇలా అనేక మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ఖరారు చేసింది.

మరిన్ని వార్తలు