నేడు సీఎల్‌పీ భేటీ

9 Mar, 2017 05:06 IST|Sakshi

అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాల అమలుకు పట్టుబట్టాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్‌పీ) భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం సీఎల్‌పీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా బుధవారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. కాగా, బుధవారం రాత్రి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, ఉత్తమ్‌.. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

కాగా బుధవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో అటెండర్లు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలను సత్కరించారు.

మరిన్ని వార్తలు