నది వద్దకు వెళితే కేసీఆర్ ఏం చేస్తారంటే..!

31 Mar, 2016 12:09 IST|Sakshi
నది వద్దకు వెళితే కేసీఆర్ ఏం చేస్తారంటే..!

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నీళ్లకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నీళ్లు సరిగా లేకనే తెలంగాణ నుంచి లక్షలమంది వలస పోయారని అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో భాగంగా సందర్భంగా ఆయన నదీమతల్లులను ఎంత గౌరవిస్తారో చెప్పారు.

తల్లి గోదావరమ్మ, తల్లి కృష్ణమ్మ అంటూ సంబోధించారు. తాను ఎప్పుడు ఏ నది దాటుతున్నా అందులో పెద్దలు చెప్పిన ఆచారాన్ని గౌరవిస్తూ నాణేలు వేసేవాడినని, తాను వేసినన్ని నాణేలు తెలంగాణలో ఇంకెవరూ వేసి ఉండకపోవచ్చని అన్నారు. గత 35 ఏళ్లుగా తనకు ఒక్కడే కారు డ్రైవర్ అని, అతడు ఎప్పుడూ కార్లో చిల్లర డబ్బులు సిద్ధంగా ఉంచేవాడని, తాను అడగగానే ఇచ్చేవాడని అన్నారు.

>
మరిన్ని వార్తలు