వణికిస్తున్న చలిగాలులు

28 Dec, 2015 09:22 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ పరిస్థితులు మరో మూడు రోజుల పాటు ఉంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఆదివారం పేర్కొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 9 డిగ్రీలు, రామగుండంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 13 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఒకటి నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొన్నిచోట్ల మూడు రోజులపాటు చలిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు స్వెట్టర్లు, జర్కిన్లు ధరించే బయటకు రావాలని సూచించింది. పిల్లలు, పెద్దలు చలిగాలుల నుంచి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

మరిన్ని వార్తలు