రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పట్టా పాస్‌ పుస్తకాల పంపిణీ: కేసీఆర్‌

16 Jan, 2018 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు.

సమావేశంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ విధులు, మున్సిపల్ చట్ట సవరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పాస్‌పుస్తకాలు ఒకరోజు ముందే గ్రామాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. దీని కోసం ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు.

మరిన్ని వార్తలు