కాసేపట్లో కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌

16 Jan, 2018 08:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి (మంగళవారం) ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణ, సంబంధిత అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, పంచాయతీ అధికారులు పాల్గొననున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం సన్నద్ధమైన నేపథ్యంలో పంచాయతీలు, సర్పంచులు, పాలకమండళ్లకు అధికారాలు, బాధ్యతలతోపాటు తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చే అంశంపైనా సీఎం చర్చించనున్నారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టులకు భూసేకరణ, సంక్షేమ పథకాలపై సీఎం సమీక్షించనున్నారు.

రెవెన్యూ అంశాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, చట్టంపై.. కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. పట్టాదారు కొత్త పాసుపుస్తకాల పంపిణీ, కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై సమావేశంలో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే మిషన్‌ భగీరథ, భూసేకరణ, సంక్షేమ పథకాలపై కూడా కేసీఆర్ సమీక్ష జరపనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు