రంగుల్లో పింఛన్ కార్డులు

1 Nov, 2014 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న వివిధ సామాజిక భద్రతా పింఛన్ కార్డులకు రంగులు ఖరారయ్యాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నమూనా పింఛన్ కార్డులను 20 రకా ల రంగుల్లో రూపొందించగా వాటిలో మూడింటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. వృద్ధాప్య పింఛన్ కార్డుకు గులాబీ రంగును ఖరారు చేయగా, వికలాంగ పింఛన్ కార్డుకు ఆకుపచ్చ రంగు, వితంతు పింఛన్లకు ఉదారంగు(వయోలెట్)ను ఎంపిక చేశారు.

పింఛన్‌కార్డుల జారీకి గడువు సమీపిస్తున్నా, దరఖాస్తుల ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 39.95 లక్షల దరఖాస్తులు రాగా, శుక్రవారం నాటికి 24.30లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆహారభదత్ర కార్డులకు సంబంధించి మొత్తం 92.22లక్షల దరఖాస్తులకు గాను 22.68 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.

మరిన్ని వార్తలు