క్యూలోనే కామన్‌మ్యాన్

19 Nov, 2016 00:59 IST|Sakshi
క్యూలోనే కామన్‌మ్యాన్

నగదు మార్పిడి, కొత్త నోట్లు, చిల్లర కోసం సామాన్యుల తిప్పలు
- ఏటీఎంలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూలైన్లు
- ఇంకా అందుబాటులోకి రాని కొత్త రూ.500 నోట్లు - రూ.2 వేల నోటుకు ‘చిల్లర’ కష్టాలు  
 
 సాక్షి నెట్‌వర్క్: సామాన్యుడికి ఇంకా పడిగాపులు తప్పడం లేదు. నగదు మార్పిడి, కొత్త నోట్లు, చిల్లర కోసం బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇళ్లలో శుభకార్యాలున్నవారు సైతం ఆ  పనులు వదిలి క్యూలైన్లలో నిలబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు చిల్లర కోసం కష్టాలు తప్పడం లేదు. దీంతో అన్ని రకాల వ్యాపారాలూ దాదాపుగా స్తంభించిపోయాయి. చెక్కులతో వారానికి రూ.24 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్న నిబంధన ఉన్నా.. నగదు అందుబాటులో లేక చాలా బ్యాంకులు రూ.10 వేల వరకు మాత్రమే ఇస్తున్నాయి. అది కూడా అన్నీ రూ.2 వేల నోట్లనే ఇస్తుండడంతో చిల్లర కోసం ఇబ్బందులు తప్పడం లేదు.

 రూ.2 వేల నోటుతో తప్పని తిప్పలు: శుక్రవారం నుంచి కొన్ని ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు మాత్రమే వస్తుండడంతో.. వాటికి చిల్లర మార్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులెవరూ ఆ నోట్లకు చిల్లర ఇచ్చే పరిస్థితి ఉండదు. పూర్తిగా రూ.2 వేలకు సామగ్రి కొనుగోలు చేయాల్సిన అవసరం అసలే ఉండదు. దీంతో ఏటీఎంలలో వెంటనే కొత్త రూ.500 నోట్లను పెట్టేలా మార్పులు చేసి, అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 జోరుగా కమీషన్ల దందా..
 పాత నోట్ల మార్పిడిపై భారీ ఎత్తున్న కమీషన్ల దందా నడుస్తోంది. పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను మార్చేందుకు దళారులు 20 నుంచి 35 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు బ్యాంకు అధికారులు దళారులకు సహకరించి కొత్త నోట్లు ఇస్తున్నారు. పోలీసులు ఇప్పటికే పలువురు దళారులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారని సమాచారం. బంగారం వ్యాపారులు ఐటీ నోటీసుల భయంతో తమ జ్యుయెలరీ దుకాణాలను మూసివేసి.. ఇళ్ల నుంచే జీరో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 శుభకార్యాలు వదిలి క్యూలైన్లలో..
 పెళ్లి కార్డు, తగిన ఆధారాలు చూపిస్తే రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసినప్పటికీ.. ఆచరణలో అమలు కావడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం అంబర్‌పేట్‌కు చెందిన వినోద్‌యాదవ్ అనే యువకుడి వివాహం ఈనెల 24న జరుగనుంది. ఆయన పెళ్లి పనులు పక్కనపెట్టి మరీ నగదు కోసం స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద రెండు రోజులుగా క్యూలైన్లో నిల్చున్నా నగదు ఇవ్వడం లేదు. మేనేజర్ లేరంటూ బ్యాంకు అధికారులు తనను తిప్పి పంపుతున్నారని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా పలువురు ఖాతాదారులు సైతం తమ ఇళ్లలో శుభకార్యాలున్నా.. ఆ పనులను పక్కనబెట్టి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
 
 రూ.14 వేలు.. చిల్లర

 నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన చాణక్య శనివారం ఉదయం తన ఖాతాలోని సొమ్ము విత్‌డ్రా చేసుకోవడానికి స్థానిక ఎస్‌బీహెచ్ బ్రాంచీకి వచ్చాడు. మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చొన్నాడు. కానీ బ్యాంకులో డబ్బులు అరుుపోయాయి. అరుునా చాణక్య తనకు డబ్బులు అత్యవసరం కావడంతో.. రూ.14 వేలకు మొత్తం పది రూపాయల నాణేలను తీసుకుని వెళ్లాడు. అదే ఈ చిత్రం.


 
 ఇక పీపీపీ.. డుండుంనే..
   ఈ ఫొటోలో ఉన్న తండ్రి, కుమార్తెల పేర్లు మైలారం వెంకటయ్య, కల్యాణి. వారిది జనగామ మండలం లింగాల ఘణ పురం మండలం జీడికల్. ఈనెల 24న కల్యాణికి వివాహం జరుగ నుంది. వెంకటయ్య కొంత డబ్బు బ్యాంకులో దాచుకున్నాడు. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. పెద్ద నోట్లరద్దు నిర్ణయం వెలువడింది. దీంతో వెంకటయ్య ఆందోళనలో మునిగిపోయాడు. పెళ్లి కార్డుల నుంచి కొన్ని ఏర్పాట్ల వరకు బాకీపై సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి కోసం రూ.2.5 లక్షలు తీసుకోవచ్చన్న తాజా నిబంధనతో... శుక్రవారం తన కుమార్తె కల్యాణితో కలసి జనగామ ఎస్‌బీఐకి వచ్చి రూ.2.5 లక్షలు డ్రా చేసుకుని వెళ్లారు.
 
 ఖాతాదారులూ.. ‘కూల్’..
 నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం వచ్చే జనానికి ఉపశమనం కలిగించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఎస్‌బీహెచ్ అధికారులు శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు, ఏటీఎం వినియోగదారులకు చీఫ్ మేనేజర్ డి.సురేష్‌బాబు స్వయంగా వెళ్లి కూల్‌డ్రింక్స్ అందించారు. పెద్ద సంఖ్యలో వస్తూ, క్యూలలో నిలబడుతున్న ఖాతాదారులకు మజ్జిగ, తాగునీరు, కూల్‌డ్రింక్స్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండకుండా బ్యాంకులో ప్రత్యేకంగా ఏటీఎం కార్డుదారులకు కౌంటర్ ఏర్పాటు చేరుుంచామన్నారు.
 
 నోట్లు చెల్లక..

  పెద్దనోట్లు చెల్లక, వైద్యం అందక మెదక్ జిల్లా వెల్దుర్తి మండ లం అచ్చం పేటకు చెందిన జూలూరి నర్స య్య (65) అనే వృద్ధుడు మృతి చెందాడు. 5 రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధపడుతున్న నర్స య్యను.. వెల్దుర్తిలోని పలు ప్రైవేటు ఆస్ప త్రులకు తీసుకెళ్తే పాత నోట్లు చెల్లవంటూ వైద్యం చేయలేదు. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడా పెద్ద నోట్లు చెల్లక, వైద్యులు రాసిన టెస్టులు చేరుుంచుకోలేక గురువారం ఇంటికి తిరిగి వచ్చేశారు. కొంత సేపటికే నర్సయ్య మృతి చెందాడు. ‘‘పెద్ద నోట్లు చెల్లకనే నర్సయ్య ప్రాణం పోరుుంది. చుట్టా లు ఇచ్చిన నోట్లు తీసుకుని ఆస్పత్రులకు పోతే.. చెల్లవంటూ డాక్టర్లు చూడలేదు. మందుల దుకాణానికి పోతే మందులు ఇవ్వలేదు. ఈ చెల్లని నోట్లు మా ప్రాణాలు మింగుతున్నారుు..’’ అని నర్సయ్య భార్య దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు