ఇదేం బాదుడు?

13 Aug, 2013 05:12 IST|Sakshi
ఇదేం బాదుడు?

 సాక్షి, సిటీబ్యూరో:మౌలిక వసతుల కల్పన మా విధి కాదంటున్న ట్రాఫిక్ పోలీసులు..
 ఆ బాధ్యత తనదే అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బల్దియా అధికారులు..
 ఫలితంగా పార్కింగ్ వసతుల్లేకుండా నడుస్తున్న సముదాయాలు..

 
 చివరకు జరిమానా చెల్లించి జేబుకు చిల్లుపెట్టుకునేది మాత్రం సామాన్యులు.. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సోమవారం నుంచి ‘భారీ బాదుడు’ షురూ చేశారు. సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌తో పాటు నో పార్కింగ్ ఉల్లంఘనలకు రూ.1000 చొప్పున వడ్డిస్తున్నారు. మిగిలిన మూడింటి విషయం అలా ఉంచితే ‘నో పార్కింగ్’ విషయంలో మాత్రం నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలకు సరైన పార్కింగ్ వసతులే లేనప్పుడు అక్కడకు వచ్చిన తాము వాహనాలను ఎక్కడ పార్క్ చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. వాణిజ్య సముదాయూలకు పార్కింగ్ స్థలం తప్పనిసరంటూ చేసేవన్నీ ఆర్భాటపు ప్రకటనలేనా? అని నిలదీస్తున్నారు. నగరంలోని అనేక వాణి జ్య సముదాయూలు, కేఫ్, దుకాణాలు సరైన పార్కింగ్ స్థలాలు లేకుండానే కొనసాగుతున్నా యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన పాపానికి వాహనదారులు ‘భారం’ మోయాల్సి వస్తోంది.

 జీవో ఉన్నా అమలు సున్నా...


 నగరంలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా నో-పార్కిం గ్‌లోనూ వాహనాలు నిలపడం అనివార్యమైం ది. ట్రాఫిక్ ఇబ్బందులకు ఇదీ ఓ ప్రధాన కారణమే. పలుచోట్ల వాణిజ్య సముదాయూలు, దుకాణాలకు సరైన పార్కింగ్ వసతుల్లేవు. వాటికి వచ్చిన వారంతా రోడ్లపైనే వాహనాలకు ఆపుతున్నారు. ఫలితంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నారుు. ఈ క్రమంలో ప్ర భుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బ న్ డెవలప్‌మెంట్ శాఖ ద్వారా 2006లో జీవో నెం. 86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయూలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా ఉంది. మల్టీప్లెక్స్‌తో కూడిన సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మొత్తం విస్తీర్ణంలో 60 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు 40 శాతం పార్కింగ్ స్థలం తప్పనిసరి. వాణిజ్య సముదాయాలు తదితరాలకు 25 శాతం ఉం డాలి. అలా లేని వాటికి లెసైన్స్ రెన్యువల్ చేయవద్దని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.

 రెన్యువల్స్ ఎలా సాధ్యం?


 వాణిజ్య సముదాయూలు, సినిమా హాళ్లు, కేఫ్‌ల యజమానులకు ఏటా జనవరి నుంచి డిసెంబరు వరకు పోలీసులు లెసైన్స్ జారీ చేస్తారు. వీటి రెన్యువల్ ప్రక్రియ నిరంతరాయం. ఆ సమయంలో శాంతి భద్రతల కోణం నుంచే కాక వీటివల్ల ఏవైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయూ? అనే కోణంలోనూ పరిశీలించాల్సి ఉంటుంది. జీవో ప్రకారం నిర్దేశించిన పార్కింగ్ స్థలం లేకుంటే లెసైన్స్ రెన్యువల్ నిలిపివేయూలి. అరుుతే నగరంలో ఉన్న వాణిజ్య సముదాయూలు, కేఫ్‌ల్లో దాదాపు 70 శాతం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. వీటి లెసైన్సుల రెన్యువల్ చేసే సమయంలో పోలీసు శాఖ పట్టించుకోకపోవడమే దీనికి కారణం. కొన్నైతే ఏకంగా రెన్యువల్ చేరుుంచకుండానే కొనసాగుతున్నారుు. మరికొ న్ని సంస్థల యూజమాన్యాలైతే రెన్యువల్ కోసం కట్టిన చలాన్ రసీదునే లెసైన్స్‌గా పేర్కొంటూ నెట్టుకొచ్చేస్తున్నారు. వీటి విషయంలో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పుడు మాత్రం భారీ జరిమానాల పేరుతో బాదేయడాన్ని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. పార్కింగ్ వసతులు లేని సముదాయాలు, వాణిజ్య ప్రాంతాలకు రెన్యువల్ ఆపేస్తే... అక్కడకు తాము వెళ్లడం, నో పార్కింగ్‌లో వాహనం నిలపాల్సిన అవసరమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు.

 పట్టనట్లు వ్యవహరిస్తున్న ‘గ్రేటర్’...


 నిబంధనల ప్రకారం ఏదైనా స్థలం, సముదాయూనికి సంబంధించిన కొలతలు తీయూల్సిన బాధ్యత ఇంజనీరింగ్ విభాగానికి. ఇది జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉంటుంది. సముదాయం ఉన్న ప్రాంతం, వాటిలోని విభాగాలు, ఇతర ప్రాంతాలను కచ్చితంగా లెక్కకట్టడానికి అవసరమైన సాంకేతిక అర్హత, పరిజ్ఞానం వారికే ఉంటుంది. నగరంలో మాత్రం ఈ పార్కింగ్ ఏరియూను కొలిచే బాధ్యత ఏమాత్రం ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ఇది తమ పని కాదన్నట్లు ‘గ్రేటర్’ అధికారులు వ్యవహరిస్తున్నారు. లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ పరిశీలించడం, ఆ సముదాయూన్ని సందర్శించి కొలతలు తీసి సరిచూడటం వీరి పనే. ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా లేని వాటిని కూల్చే సే అధికారం సైతం వీరికి ఉంటుంది. అయితే దీన్ని పక్కాగా అమలు చేసిన పాపాన పోవట్లేదు. జీహెచ్‌ఎంసీలో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఉంది. ఇక్కడ ఇంజనీర్లూ అం దుబాటులో ఉంటారు. వీరి సహాయం తీసుకొనే విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు.

 రూ.20 కోట్లకు పైగా ‘అక్రమ దోపిడీ’...


 నాలుగేళ్లలో (2009-2012)నో పార్కింగ్, డేంజరస్ పార్కింగ్‌ల్లో వాహనాలు ఉంచారంటూ స్పాట్‌లో విధించిన చలాన్‌లతో పాటు ఆ వాహనాలను వేరే ప్రాంతానికి క్రేన్ల ద్వారా తరలించి (టోవింగ్) చేసిన కేసులు 21,62,479 నమోదయ్యాయి. వీరిలో ఒక్కోక్కరికీ కనిష్టంగా రూ.200 జరిమానా విధించారనుకున్నా... రూ.43,24,95,800 వసూలు చేశారు. ఇందులో సగం మంది అవకాశం ఉన్నా ఉల్లంఘనలకు పాల్పడ్డారని భావించినా ... పార్కింగ్ అవకాశం లేక అనివార్యంగా నో పార్కింగ్‌లో ఆపి దొరికిపోయారు. వీరి నుంచి వసూలు చేసిన రూ.20 కోట్లకు పైగా జరిమానాలు ‘అక్రమ దోపిడీ’ కిందికే వస్తుందనడంలో సందేహం లేదు.
 
 ముందు ‘పార్కింగ్’ చూపించండి


 వ్యాపార సంస్థల వద్ద పార్కింగ్ స్థలం ఉండదు. ఆయా అవసరాలకు దుకాణాలకు వెళ్లే వారు వాహనాల్ని ఎక్కడ నిలపాలి? రోడ్డు పక్కన నిలిపితే రూ.వెయ్యి వదుల్చుకోవాల్సిందే. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆయా వ్యాపార సంస్థలు తప్పకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. నేను రోడ్డు పక్కన బండి ఆపి టీ తాగిన పాపానికి భారీగా చెల్లించాల్సి వచ్చింది. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలు ఎందుకు తొలగించరు? ఇదేం న్యాయం?
 - రఘురాంరెడ్డి, విద్యావేత్త, విద్యానగర్ విజ్ఞానపురి కాలనీ
 
 ట్రాఫిక్ చిక్కులు పరిష్కరించండి
 అడుగడునా అడ్డంకులు. రోడ్ల నిండా గోతులు ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్కమ పార్కింగ్‌లు. నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందే కనిపించరు. వీటిని పరిష్కరించకుండా జరిమానాల పేరిట వేలకు వేలు గుంజడం న్యాయం కాదు.
 - మదన్, మెకానికల్ ఇంజనీర్, నల్లకుంట
 

మరిన్ని వార్తలు