ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ‘ఆధార్’ తప్పనిసరి

5 Jun, 2016 03:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కు ఇకపై ఆధార్  తప్పనిసరి కానుంది. ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తులు ఆమ్మేవారు, కొనేవారు, సాక్షి సంతకాలు చేసేవారు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ను గుర్తింపు కార్డు కింద సమర్పించాల్సి ఉంటుంది. వీరి వేలి ముద్రలు సరిపోలని పక్షంలో ‘ఐరిస్’ తీసుకుంటారు. నిబంధనను రిజిస్ట్రేషన్ చట్టం-1908లో 26(ఎ) కింద చేర్చాలని రెవెన్యూ శాఖ శనివారం జీవో జారీ చేసింది.

మరిన్ని వార్తలు