'న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదు'

11 Jun, 2016 13:39 IST|Sakshi
'న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...తుని ఘటనను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ కాపు సామాజిక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారించాలని శైలజానాథ్ సూచించారు. ముద్రగడ అంగీకరిస్తే తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని మంత్రి నారాయణ చెప్పడం బ్లాక్ మెయిలింగ్ను తలపిస్తోందన్నారు.

మంత్రి నారాయణ కార్పొరేట్ కాలేజీల సీట్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమేనా?? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు తేడాలున్నాయని శైలజానాథ్ ఆరోపించారు. ఏపీలోని పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు