ఎనీటైం మూతే!

16 Nov, 2016 01:05 IST|Sakshi
ఆర్‌బీఐ వద్ద క్యూలో ఉన్నవారికి బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తన్న వలంటీర్లు

పని చేయని ఏటీఎంలు..  బ్యాంకుల వద్ద భారీ క్యూలు
కొనసాగిన కరెన్సీ కష్టాలు
ఎక్కడ చూసినా చిల్లర సమస్యలు
భారీగా పడిపోరుున వ్యాపారాలు

సిటీబ్యూరో:  కరెన్సీ రద్దు/మార్పిడి అమలులోకి వచ్చి వారం రోజులైనా సామాన్యుడికి తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికీ ఏటీఎంలు పూర్తిస్థారుులో పని చేయట్లేదు. మంగళవారమూ నగరంలోని అనేక ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘అతి పెద్దనోటు’తో సాధారణ ప్రజలకు చిల్లర తిప్పలు ఎక్కువయ్యారుు. గత మంగళవారం రాత్రి ప్రకటించినట్లు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచే ఏటీఎంలు పని చేయాల్సి ఉండగా అది అమలులోకి రాలేదు. ప్రతి పది ఏటీఎంలకు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. నిర్ణీత సమయాని కంటే ఐదు రోజుల ఆలస్యమైనా మంగళవారం సైతం ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థారుులో పని చేయకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అవస్థలు పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పలుచోట్ల అసహనం వ్యక్తం చేశారు.  ఇక ప్రభుత్వ రంగం బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలే ఎక్కువగా పని చేశారుు. ఏటీఎం కేంద్రాలు పూర్తిస్థారుులో  చేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఏటీఎం మిషన్లలో నింపే స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం, రూ.2000 నోటును గుర్తించేలా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడంతో పాటు ట్రే సమస్య కూడా ఉందని తెలుస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటు ‘పాత కరెన్సీ’ కంటే పొగుడు, వెడల్పుల్లో వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని ఏటీఎం మిషన్లలో పెట్టేందుకు అవసరమైన ట్రేలు సైతం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.


ఒకటి కంటే ఎక్కువ కార్డులతో...
సోమవారం నుంచి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే పరిమితిని కేంద్రం రూ.2,500కు పెంచింది. అరుుతే అనేక మందికి ఈ మొత్తం కూడా సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకువస్తున్నారు. తనది, తన కుంటుంబంలోని వారి డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులు సైతం తీసుకువచ్చి క్యాష్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో కొందరు వినియోగదారులు ఒక దఫాలో వివిధ కార్డుల్ని వినియోగించి రూ.10 వేల వరకు డ్రా చేసుకుని వెళ్తున్నారు. ఈ కారణంగానే ఏటీఎంల్లో నగదు నింపిన కొన్ని గంటలకే అవి ఖాళీ అవుతున్నారు. ఈ ‘బహుడ్రా’ విధానాలను క్యూలో ఉన్న అనేక మంది వినియోగదారులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం తెలుపుతున్నారు.


రూ.2500 ఇస్తున్న బ్యాంకులు...
‘కరెన్సీ ఓపెన్’ అరుున తర్వాత వరుసగా ఆరో రోజైన మంగళవారం సైతం బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కేంద్రం సవరించిన ప్రకటించిన దాని ప్రకారం సోమవారం నుంచి విత్‌డ్రా, ఎక్స్‌ఛేంజ్‌లకు సంబంధించి ఒక్కోక్కరికీ రూ.4.5 వేలు ఇవ్వాల్సి ఉంది. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం వాటివద్ద రద్దీ మరింత పెరిగింది. ఈ రద్దీతో పాటు కరెన్సీ కొరత నేపథ్యంలో అనేక బ్యాంకులకు చెందిన అధికారులు కేవలం రూ.2.5 వేలు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులు రూ.100 నోట్లు ఇస్తుండగా, మరికొన్ని కొత్త రూ.2 వేల నోటు ఇస్తున్నారుు. దీంతో ఈ ‘అతి పెద్ద నోటు’ తీసుకున్న వారికి చిల్లర సమస్య తప్పట్లేదు. ఎక్స్‌ఛేంజ్ చేసే వారి కంటే డిపాజిట్, విత్‌డ్రా వారికే బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నారుు.


బ్యాంకులు, ఏటీఎంల వద్ద చిరువ్యాపారాలు...
కరెన్సీ మార్పిడి, విత్‌డ్రాల కోసం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల వద్దా భారీ క్యూలు ఉంటున్నారుు. కొంతమంది ఏకంగా గంటకు పైగా నిల్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ‘కొత్త చిరువ్యాపారాలు’ వెలుస్తున్నారుు. చాయ్‌తో పాటు పల్లీలు తదితర చిరుతిళ్ళు విక్రరుుంచే ‘మెబైల్ దుకాణాలు’ కనిపిస్తున్నారుు. వీరికి నగదు చెల్లించడానికి చిల్లర సమస్య వచ్చిపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గుర్తింపు కార్డుల ప్రతులు, ఇతర పత్రాల జిరాక్సుల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఉన్న జిరాక్సు సెంటర్లకూ రద్దీ పెరిగింది.  మరికొన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పేలాలేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


వ్యాపారం ఢమాల్
నగరవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నారుు. నోట్ల మార్పిడికే రోజంతా సరిపోతుండడంతో జనాలు కనీస కొనుగోళ్లకు కూడా సమయం ఉండడం లేదు. ఇక డబ్బుల సంగతి సరేసరి. దీంతో చిరువ్యాపారాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు దివాళా తీస్తున్నారుు. హోటళ్లు, సినిమా హాళ్లు, టిఫిన్‌సెంటర్లు జనం లేక బోసిపోతున్నారుు. వస్త్రదుకాణాల్లో సిబ్బంది తప్ప ఎవరూ కన్పించడం లేదు. ఇక పెట్రోల్ బంకుల్లోనూ చిల్లర కొరత కారణంగా వివాదాలు తలెత్తుతున్నారుు. పూలు, పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్‌లు పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు