చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు టోపీ!

1 May, 2016 13:54 IST|Sakshi

నేరేడ్‌మెట్ (హైదరాబాద్) : చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం పేరుతో నగరంలోని నేరేడ్‌మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన ఓ మహిళ రూ.10కోట్ల మేర మోసం చేసి ఉడాయించింది. దీనికి సంబంధించి సుమారు 50 మంది బాధితులు ఆదివారం నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణారెడ్డి అనే మహిళ, ఆమె భర్త రఘునాథరెడ్డి డిఫెన్స్ కాలనీలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు.

చిట్టీ పాడుకున్న వారికి నగదు ఇవ్వకుండా 3 రూపాయల వడ్డీ ఆశ చూపి వారి దగ్గరే ఉంచుకునేవారు. ఇలా సుమారు 100 మందికి రూ.10కోట్ల మేర వారు బకాయిపడ్డారు. వారికి నగదు చెల్లింపులు చేయకుండా గత సోమవారం అరుణారెడ్డి, ఆమె భర్త, కుమార్తె ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బాధితులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫోన్‌నంబర్లు పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు