ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

10 May, 2017 02:04 IST|Sakshi
ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

జిల్లాల వారీగా ఆందోళనకు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలను చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో అనుసరిం చిన విధానాలు, ప్రజా సమస్యలు, చేపట్టా ల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు మూడ్రోజులపాటు నిర్వహించనున్న సమా వేశాలు మంగళవారం మగ్దూంభవన్‌లో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రిలే దీక్షలు సాగుతున్న తీరు, మిర్చి రైతుల సమస్యలు, సింగరేణిలోని తాడిచర్ల బ్లాక్‌ల ప్రైవేటీకరణ, పార్టీపరం గా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణా ళిక తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి హాజరయ్యారు. బుధ, గురువారాల్లో రాష్ట్ర కార్యవర్గం పలు అంశాలపై చర్చిస్తారు. కాగా, సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలోని తాడిచర్ల బ్లాక్‌–1, 2 ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మే 12 నుంచి 17 వరకు బస్సు యాత్రను చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమాన్ని  ఉధృతం చేయాలని తీర్మానించారు.

మరిన్ని వార్తలు