కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్తో కలెక్టర్ల భేటీ

20 Jun, 2016 11:40 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కలెక్టర్లతో ఆయన చర్చ జరపనున్నారు.

ప్రస్తుతమున్న జిల్లాలన్నీ రెండు లేదా మూడు జిల్లాలుగా పునర్విభజించే ఆలోచనలో ప్రభుత్వముంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలు, డివిజన్లు, కొత్త మండలాలపై నివేదికలు, వాటి భౌగోళిక స్వరూపం, నమూనా మ్యాపులను కలెక్టర్లు రూపొందించారు. ఈ ప్రక్రియకు నిర్దేశించిన రోడ్ మ్యాప్పై జిల్లా కలెక్టర్లతో రాజీవ్ శర్మ ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై కలెక్టర్లకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు