‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించాలి

25 Sep, 2016 00:53 IST|Sakshi
‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించాలి

వివిధ శాఖల అధికారులకు సీఎస్ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ీసీఎస్ రాజీవ్‌శర్మ  ఆదేశించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వర కు బతుకమ్మ నిర్వహిం చనుండటంతో శని వారం ఆయన అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు.  పండుగ ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేస్తోందని, అక్టోబర్  6న ఆరు వేల మంది మహిళలతో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మను నిర్వహించాలన్నారు. 9న ఊరేగింపుగా బతుకమ్మ అడుతూ వచ్చి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తారని, దీనికి ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  జిల్లాల్లో బతుకమ్మ నిమజ్జనానికి చెరువులను సిద్ధం చేయాలన్నారు. నగరంలోని ప్రధాన హోటళ్ల వద్ద  సంబరాలకు గుర్తుగా బతుకమ్మలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి పేర్కొన్నారు. సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా,  రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు,   హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు