పప్పుధాన్యాల సాగు భేష్‌

13 Feb, 2017 01:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ రబీలో అంచనాలకు మించి పప్పుధాన్యాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఈసారి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలనుకున్న నేపథ్యంలో సాగు పెరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా 3.17 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 4.52 లక్షల ఎకరాల్లో (146%) సాగైనట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. సాధారణం కంటే ఏకంగా 1.35 లక్షల ఎక రాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాధారణ సాగు 2.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల్లో (158%) సాగైంది. పెసర సాధారణ సాగు 35 వేల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37,400 ఎక రాల్లో (127%) సాగైంది.

మినుము సాధారణ సాగు 32,500 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 45 వేల ఎకరాల్లో (141%) సాగైంది. ఇక  రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా...  ఏకంగా 14.60 లక్షల ఎకరాల్లో (110%) నాట్లు పడ డం గమనార్హం. మొక్కజొన్న సాధారణ విస్తీ ర్ణం 4.07 లక్షల ఎకరాలు కాగా,3.80 లక్షల ఎకరాల్లో (93%) సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ పంటల సాగు విస్తీర్ణం 97 శాతానికి చేరు కుంది. సాధారణంగా అన్ని పంటలు 30.20 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 29.45 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వంద శాతానికి మించి పంటల సాగు జరిగింది.  

మరిన్ని వార్తలు