-

హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

26 Nov, 2016 10:22 IST|Sakshi
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆదివారం 'హైదరాబాద్ 10కే రన్' జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వాహన చోదకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని సహకరించాలని కోరారు.
 
- రాజ్‌భవన్, ఆనంద్‌నగర్, పంజగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ స్టాట్యూ(ఖైరతాబాద్ చౌరస్తా) నుంచి నిరంకారి వైపు పంపిస్తారు.
- మింట్ కాంపౌండ్, ఐ-మాక్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు పంపిస్తారు.
- ఇక్బాల్ మీనార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను తెలుగు తల్లి చౌరస్తా, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెక్రటేరియేట్ పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా, బైబిల్ హౌస్ మీదుగా మళ్ళిస్తారు.
- హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించకుండా తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. 
- లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని జీహెచ్‌ఎంసీ ఆఫీస్, ఐటీ లైన్, హిమాయత్‌నగర్‌ల వైపు పంపిస్తారు.
- డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చిల్డ్రన్స్ పార్క్, అప్పర్‌ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. వీటిని కట్ట మైసమ్మ దేవాలయం, కవాడీగూడ మీదుగా మళ్ళిస్తారు.
- రసూల్‌పుర నుంచి నల్లగుట్ట రైల్ అండర్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు.
మరిన్ని వార్తలు