గోటిచుట్టు.. ‘నోటు’ పోటు

12 Nov, 2016 01:52 IST|Sakshi

ఆసుపత్రుల్లో రోగులకు తప్పని కరెన్సీ కష్టాలు
- పెద్ద నోట్లు నిరాకరిస్తూ పలుచోట్ల నోటీసు బోర్డులు
- కేంద్రం మినహారుుంపు ఇచ్చినా యాజమాన్యాల ఇష్టారాజ్యం
- చేసేది లేక కొన్నిచోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లిస్తున్న రోగులు
- డబ్బులు కట్టనివారి డిశ్చార్జ్‌లు తాత్కాలికంగా నిలిపివేత
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకూ కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. ‘పెద్ద నోట్ల’నుంచి కేంద్రం ఆస్పత్రులకు మినహారుుంపు ఇచ్చినా.. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు పాతనోట్లను తీసుకునేందుకు నిరాకరించారుు. బిల్లు చెల్లించకపోతే చికిత్సలు నిలిపి వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో రోగులు అష్టకష్టాలు పడ్డారు. కొందరు రోగులు చేసేది లేక తమ బంధువులను ఆస్పత్రులకు పిలిపించుకుని వారి వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించారు. కార్డులు లేని వారు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బిల్లులు చెల్లించని వారి డిశ్చార్జ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక వివిధ ప్రమాదాల్లో గాయపడే క్షతగాత్రులను ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకు వస్తే వైద్యులు వారికి సీటీ, ఎంఆర్‌ఐ సిఫార్సు చేస్తుంటారు. శుక్రవారం ఇలా వచ్చినవారు ఇబ్బందులపాలయ్యారు. సమయానికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నిర్ణరుుంచిన ధరల ప్రకారం వారు ఆయా టెస్టులకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పాతనోట్లు ఇవ్వగా తీసుకునేందుకు బిల్లింగ్ స్టాఫ్ నిరాకరించడంతో వారంతా ఇబ్బంది పడ్డారు.

 మందుల దుకాణాలు ‘నో..’
 హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మాని యా, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, నిలోఫర్, ఎంఎన్‌జే సహా పలు ప్రభుత్వ, కార్పొరేట్ సూ పర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, జనరల్ నర్సింగ్ హోం, క్లినిక్స్‌ల అవుట్ పేషంట్ విభాగానికి రోజు కు సగటున 50-60 వేల మంది రోగు లు వస్తుంటారు. వైద్యులు రాసిన మందులు తీసుకునేందుకు ఆయా ఆస్పత్రుల ముందు న్న ఫార్మసీలకు వెళ్లగా వారు పాతనోట్లను నిరాకరించారు. ఆ దుకాణాల్లో కార్డు సౌలభ్యం కూడా లేక పోవడంతో రోగులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. కార్డు సౌలభ్యం ఉన్న చోట వాస్తవ బిల్లుకు అదనంగా 5 శాతం చెల్లించేందుకు అంగీకరించిన వారికే మందులిచ్చారు. ఇక డయాగ్నోస్టిక్ సెంటర్లలోనూ కష్టాలు తప్పలేదు. విజయ, కోణార్క్, సత్య వంటి పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లు మినహా మిగిలినవన్నీ పాత నోట్లను నిరాకరించారుు.
 
 ఎక్స్‌రేకు చిల్లర ఇవ్వమన్నారు
 నా కూతురు అనిత తొమ్మిది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తీసుకొచ్చాను. కాలికి రాడ్ వేశారు. మూడు రోజుల నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడం లేదు. డాక్టర్లు రాసిన ఎక్స్‌రే టెస్టుకు రూ.500 నోటు ఇస్తే చిల్లర ఇవ్వమంటున్నారు. కూలీ పని చేసుకుని జీవించే మాకు బ్యాంక్‌లకు వెళ్లి మార్చుకోవడం తెలియదు. పండ్లు, బ్రెడ్ కోనాలన్న కష్టంగా ఉంది.
     - నర్సమ్మ, కీసరగుట్ట
 
 చిల్లర ఇవ్వలేదు
 నా భార్యకు నెలలు నిండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాను. రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే తీసుకోవడం లేదు. ఆస్పత్రిలో డాక్టర్ కన్సల్టేషన్ రూ.300. ఈ బిల్లు చెల్లించేందుకు రూ.500 నోటు తీసుకుని కౌంటర్‌కు వెళ్తే చిల్లర కూడా ఇవ్వలేదు. పాత నోట్లు చెల్లవని బోర్డు పెట్టాం కనిపించటం లేదా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బ్యాంక్‌లోకి వెళ్లి మార్పిడి చేరుుంచే సమయంలేక తప్పని పరిస్థితుల్లో టెస్టులు చేరుుస్తున్నాను.
     - సీహెచ్ సుమన్, అభ్యుదయనగర్ కాలనీ, హైదరాబాద్

మరిన్ని వార్తలు