‘నోట్ల రద్దు’తో సైబర్‌ నేరాలకు చెక్‌

11 Jan, 2017 03:30 IST|Sakshi

మోసాలు తగ్గాయంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్‌:
పెద్ద నోట్ల రద్దు తర్వాత సైబర్‌ నేరాలు పెద్దగా లేవని రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం సెంటర్లలో డబ్బులు ఉండ టం లేదు. రద్దుకు ముందు ఇంటర్నెట్‌ బ్యాంకిం గ్‌పై పెద్దగా అవగాహన లేకపోవడంతో సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోయారు. కానీ రద్దు తర్వాత ప్రతీ ఒక్కరు మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరి స్తున్నారని సైబర్‌ క్రైమ్‌ అధికారులు గుర్తించారు.

ఇక ఏటీఎం సెంటర్లలో జరిగే ‘స్కిమ్మింగ్‌’ మోసాలు అస్సలు కనిపించడం లేదన్నారు. దీని కి కారణం.. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు పెట్టిన వెంటనే నిమిషాల వ్యవధిలో ఖాళీ అయిపోతుండటమేనని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూ నోట్ల కోసం ఏటీఎంల వద్ద క్యూ ఉండటం తో సైబర్‌ నేరగాళ్లకు స్కిమ్మింగ్‌ పరికరాలు అమర్చే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. నవంబర్‌ 8కి ముందు ప్రతిరోజు  రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 సైబర్‌ నేరాలు నమోదయ్యేవని, ప్రస్తుతం వారానికి రెండు, మూడు కేసులు కూడా ఉండటం లేదని సైబర్‌ క్రైమ్‌ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు