‘సైబర్ ముఠా’పై ఐబీ ఆరా

25 Feb, 2014 04:30 IST|Sakshi
  •  సీసీఎస్‌కు వచ్చి వెళ్లిన ఉన్నతాధికారులు
  •     కేసు వివరాల సేకరణ
  •     నిందితుల కస్టడీ కోరుతూ  పోలీసుల పిటిషన్
  •     ఐటీ, డీఓటీలకూ లేఖలు రాయాలని నిర్ణయం
  •  సాక్షి, సిటీబ్యూరో:  ‘+92’ నెంబర్‌తో ఫోన్లు చేసి జనాన్ని నిండా ముంచుతున్న ముఠా గురించి కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఆరా తీస్తోంది.  ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు నిందితుల్ని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లోని సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. శనివారం సీసీఎస్ పోలీసుల్ని కలుసుకున్న ఐబీ అధికారులు ఈ కేసులోని ప్రాథమిక అంశాలను తెలుసుకున్నారు. ఈ గ్యాంగ్‌కు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్, పాకిస్తాన్‌ల్లోనూ నెట్‌వర్క్ ఉండటంతో లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

    ఇందులో భాగంగా ముగ్గురు నిందితుల్నీ తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సైబర్‌క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘+92’ ఫోన్ కాల్స్ బారినపడ్డామంటూ గడిచిన ఆరు నెలల్లో సైబర్ క్రైమ్ పోలీసులు 16 ఫిర్యాదులందాయి.  ఈ బాధితులు దాదాపు రూ.24 లక్షలు కోల్పోయారు. కాచిగూడకు చెందిన గృహిణి ఆవేదనతో ‘+92’ కేసుల దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన డీసీపీ జి.పాలరాజు ప్రత్యేకృ బృందాన్ని రంగంలోకి దింపారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఈ బృందం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన షహెన్‌షా, మహ్మద్ అఫ్తాబ్‌లతో పాటు బీహార్‌లోని పట్నాకు చెందిన సుజీత్‌కుమార్‌లను అరెస్టు చేసింది. వీరి విచారణలోనే దుబాయ్, పాకిస్తాన్‌లకు చెందిన కోణాలు వెలుగులోకి వచ్చాయి.
     
    ఐఎస్‌ఐ అనుమానంతోనే ఐబీ...
     
    ఇప్పటి వరకు విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాద సంస్థలకు సహాయసహకారాలు అందించడం, నకిలీ నోట్లను గు ప్పించడం ద్వారా పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. అయితే, ఇది ఇప్పుడు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు వెల్లడించిన అంశాల ఆధారంగా సీసీఎస్ పోలీసులు అంచనా వేశారు. దీంతో దేశభద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించి ఐబీకి సమాచారమిచ్చారు. కేసు వివరాలను సేకరించిన ఐబీ అధికారులు విదేశీ కోణాన్ని లోతుగా ఆరా తీస్తున్నారు.

    ‘+92 నేరాలకు’ సంబంధించిన డబ్బును ప్రత్యేక హవాలా విధానం ద్వారా దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు తరలిస్తుండటాన్ని ఆదాయపుపన్ను (ఐటీ) శాఖ దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్లాలని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. బాలీ వుడ్ స్టార్ అమితాబచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తున్న ఈ మోసగాళ్లు టార్గెట్ చేసిన వారి గుర్తింపుపత్రాలతో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు తయా రు చేయించి ఈ-మెయిల్ చేశారు. దీని కోసం నిందితులు ప్రాక్సీ మెయిల్ ఐడీ లు వినియోగించినట్లు తేలడంతో ఈ సర్వర్ల వివరాలు అందించాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డీఓటీ)కి లేఖ రాశారు.
     
    కీలక వ్యక్తుల కోసం వేట...

    ఈ తరహా ముఠాలు మధ్యప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్‌ల్లోనూ ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు కీలక వ్యక్తుల్ని పట్టుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం ముగ్గురు నింది తుల్నీ తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిందితులపై అన్ లాఫ ుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఆరోపణలు నమోదు చేయడంతో దర్యాప్తును ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించారు. నిందితుల వద్ద నుంచి పోలీ సులు స్వాధీనం చేసుకున్న వాటిలో బోగస్ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులతో పాటు .38 తూటాలూ  ఉన్నాయి. బోగస్‌వి ఎలా సేకరిస్తున్నారు? తూటాలు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? అనే అం శాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సైబర్ నేగాళ్లను కస్టడీకి తీసుకున్నాక ఉత్తరాదికి తీసుకెళ్లి మిగిలిన నిందితుల కోసం వేటాడాలని సీసీఎస్ అధికారులు భావిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు