గణేశ్ ఉత్సవాలపై సైబరాబాద్ సీపీ సమీక్ష

24 Aug, 2016 18:08 IST|Sakshi

హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలఫై సైబరాబాద్ సీపీ నవీన్ చంద్ బుధవారం సమావేశం నిర్వహించారు.  వచ్చే నెల 5న వినాయక చవితి సందర్భంగా... సైబరాబాద్ పరిధిలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేయాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని సీపీ స్పష్టం చేసారు. అందుకు అనుగుణంగా ఈ నెలా 25 నుంచి 31 వరకు దరఖాస్తు తప్పనిసరని, దరఖాస్తులు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్.. దరఖాస్తుకు  తప్పనిసరిగా జత చేయాలని సీపీ తెలిపారు.

ఈ మండపాలు పోలీసులు పేర్కొనే ప్రమాణాల మేరకు ఏర్పాటు చేయాలని అందుకు భిన్నంగా ఉంటే అనుమతించేది లేదని సీపీ స్పష్టం చేశారు. మండపాల వద్ద డీజేలకు  అనుమతి లేదని, బాక్స్ టైపు లౌడ్ స్పీకర్ లను మాత్రమే పెట్టాలని సూచించారు. ఇవి కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు