ఫేస్‌బుక్ కీచకుడి ఆటకట్టు

28 Feb, 2016 09:53 IST|Sakshi
ఫేస్‌బుక్ కీచకుడి ఆటకట్టు

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతులను వేధిస్తున్న బీటెక్ చదివిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురిలి ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నర్వ సాయి శాంతన్‌ను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..నర్వ సాయి శాంతన్ తెలిసిన అమ్మాయిలను ఫాలో అవుతూ వారి కదలికలను సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసేవాడు.  
 
 టెలిఫోన్ కాల్స్‌ను కూడా రికార్డు చేసి తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అయినా లొంగకపోవడంతో వారి పేరు మీదనే నకిలీ ఎఫ్‌బీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సదరు బాధిత అమ్మాయిల ఫొటోలతో పాటు అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేసేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి ఫ్లాట్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది మహిళలపై అతను వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది.

>
మరిన్ని వార్తలు