ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయి: మంత్రి

30 Aug, 2019 20:37 IST|Sakshi


హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమ ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  మంత్రి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అందరినీ ఒక చోట కలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు.

 తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కలిసి పనిచేయటం వల్లే కొత్త రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళుతోందన్నారు. తన శాఖ ఉద్యోగుల పనితీరు కృషి కారణంగా దేశంలోనే నెంబర్ వన్‌గా కొనసాగుతోందన్నారు. కేసీఆర్ కిట్స్‌తో డాక్టర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఓపీ మూడు నాలుగు వంతులు పెరిగినా వైద్యులు , సిబ్బంది నిబద్దతతో పనిచేస్తున్నారని చెప్పారు. హెల్త్ కార్డులతో ఉద్యోగులకు కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. 

మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. పరిపాలనలో కూడా విజయం సాధించామన్నారు. తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని, సమస్యలన్నీ పరిష్కరించుకుని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తామని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు