నా కులం గురించి ఇప్పుడెందుకు?

23 Jan, 2016 17:15 IST|Sakshi
నా కులం గురించి ఇప్పుడెందుకు?

హైదరాబాద్ : ఇటీవల హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుల ప్రస్తావనపై వస్తున్న వార్తలను తల్లి రాధిక ఖండించారు. తాను మాల సామాజిక వర్గంలో జన్మించానని, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో తన వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తనకు మగ్గురు సంతానమని... మూడో బిడ్డ పుట్టిన అనంతరం, కుటుంబ కలహాల నేపథ్యంలో తాము విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు రోహిత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిదు రోజుల తర్వాత స్పందించడాన్ని రోహిత్ సోదరుడు తప్పుబట్టారు. భరతమాత ఓ బిడ్డను కోల్పోయిందని ప్రధానికి ఇప్పుడు అర్థమైందా అని అన్నారు. తన తమ్ముడు చావును కులంతో ముడిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు