పాలిసెట్ వెబ్ ఆప్షన్లకు నేడు ఆఖరు

4 Jul, 2016 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 4వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని విద్యార్థులు 4న కూడా ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. చివరి దశ వెబ్ ఆప్షన్లలో భాగంగా 11,911 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. వారికి 6న సీట్లను కేటాయిస్తామని, 8వ తేదీలోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

ఇక మొదటి దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీట్లు పొందిన విద్యార్థులు చివరి దశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఇప్పుడు సీటు అలాట్ అయితే మొదటి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు ఆటోమెటిక్‌గా రద్దవుతుందని పేర్కొన్నారు. కాబట్టి మొదటి దశలో వచ్చిన సీటును వద్దనుకుంటనే ఈ చివరి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు