దేశాన్ని చులకన చేస్తే సహించలేను

23 Jan, 2017 03:44 IST|Sakshi
దేశాన్ని చులకన చేస్తే సహించలేను

వాయుసేన వైస్‌ చీఫ్‌ ఎస్‌.బి.దియో
సాక్షి, హైదరాబాద్‌: భారతదేశాన్ని ఎవరైనా చులకన చేస్తే సహించలేని తత్వం తనదని వాయుసేన ఉప అధిపతి ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీ దియో పేర్కొన్నారు. గతంలో రక్షణ రంగంలోని కొన్ని పద్ధతుల వల్ల సమస్యలు ఎదురైనా ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయిందని, దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులకు ప్రథమ ప్రాధా న్యం లభిస్తోందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్‌ సొసై టీ ఆఫ్‌ ఇండియా సమావే శంలో ఆయన పాల్గొన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా తన వంతు ప్రయత్నాలు చేస్తోందని సొసైటీ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు, రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు